15 July, 2026 | 4:45 PM

Breaking News

కంచర్లకు అదనపు ఆర్టీసీ బస్సు ట్రిప్పు మంజూరు   •   93,101,104 BLO బ్లాక్ లను సందర్శించిన మాజీ జెడ్పిటిసి   •   క్రమశిక్షణ ఐక్యతకు నీడలు ఉపకరిస్తాయి: సిఐ డి.గురుస్వామి   •   టీజీవీపీ భిక్కనూర్ మండల కళాశాల కమిటీల నియామకం   •   కంటైనర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు, ప్రయాణికులు క్షేమం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •   యోగాతో మానసిక ప్రశాంతత ఆరోగ్యం   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సురేందర్   •   కల్తీ డీఏపీ ఎరువుల దందా బట్టబయలు   •   ప్రతి విద్యార్థి పాఠశాలలో రాగి జావా తీసుకునే విధంగా చూడండి   •  

కొలనుపాకలో కనుమరుగైన శాతవాహనుల గ్రామం

22-08-2024 12:45 AM

చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి వెల్లడి

హైదరాబాద్, ఆగస్టు 21(విజయక్రాంతి): కొలనుపాక  వాగు ఒడ్డున  శాతవాహనుల కాలం నాటి  ప్రాచీన చారిత్రక గ్రామాన్ని పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాకలోని పీతిల్ల వాగు ఒడ్డున పాటిగడ్డపై పరిశోధన చేశారు. ఈ సందర్భంగా రత్నాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాచీన కాలం నాటి గ్రామం వదిలి వెళ్ళిన చారిత్రిక ఆధారాలు లభించే చోటును పాటిగడ్డ అంటారని తెలిపారు. కొలనుపాక పాటిగడ్డపై ఒకటో శతాబ్దానికి ముందు, ఆ తర్వాత కాలంలో మానవ నాగరికత విలసిల్లిందని చెప్పడానికి అనేక ఆధా రాలు లభిస్తున్నాయని చెప్పారు.

వాగు ఒడ్డు నుంచి గోశాల మధ్యలో ఉపరితల పరిశోధనలో శాతవాహన కాలం నాటి బౌద్ద మత నిర్మాణాలకు ఉపయోగించే పాలరాయి ముక్క,  మట్టి పూస, గాజు పూస, వివిధ రంగుల్లో ఉన్న గాజు ముక్కలు, గవ్వలు, అప్పటి విసుర్రాయి పైభాగంలో తిరిగే ఉబ్బెత్తుగా ఉన్న గుండ్రని రాయి, తెలుపు రంగుపై నల్లని గీతలతో డబ్బాలు, డిజైన్లు వేసిన కుండ పెంకులు , రాతి పనిముట్లు, ఎరుపు, నలుపు, బూడిద రంగులో ఉన్న  కుండ పెంకులు, ఇటుక ముక్కలు, కోడి గుడ్డు ఆకారంలో ఉన్న రోలు లభించాయని వెల్లడించారు.

ఈ చారిత్రక ఆధారా లను ద్వారా ఇక్కడ  శాతవాహన కాలంలో ఒకటి నుంచి 3 శతాబ్దాల్లో ఒక గ్రామం ఏర్పడిందన్నారు. బౌద్ధం విలసిల్లిందని పేర్కొన్నారు. నల్లటి గ్రానైట్ రాయితో ఉన్న బౌద్ద శిల్పం జైన దేవాలయం  పక్కన సందర్శకులను అనుమతించని ఒక గదిలో ఉందని వివరించారు. సోమేశ్వరాలయం ముందు ఎడమ వైపు ధ్వజ స్తంభం వద్ద భూగర్భంలో ఇటుకల నిర్మాణం ఉందని తెలిపారు. చాళుక్యుల కాలంలో కొలనుపాక కొంత కాలం రాజధానిగా ఉందని చెప్పారు. పీతిళ్ల వాగు నుంచి జైన ఆలయం వరకు పురావస్తు శాఖ పరిశోధిస్తే భూ గర్భంలో దాగి ఉన్న చరిత్ర బయటపడే అవకాశం ఉందని రత్నాకర్‌రెడ్డి పేర్కొన్నారు.