ఆర్టీసీ సమ్మె చరిత్రాత్మకం
తెలంగాణ ఉద్యమానికి సైరన్ ఊదింది మొట్టమొదట ఆర్టీసీ కార్మికులే తమ న్యాయపరమైన డిమాండ్లను ఉద్యమంలో భాగం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 27 రోజుల పాటు 10,600 బస్సులు డిపోలకే పరిమితం చేశారు. ఉద్యమంలో 56 వేలమంది ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొని ఉద్యమానికి ఊపిరి పోశారు. ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె చరిత్రాత్మక పర్వం.ఆనాటి ఆర్టీసీ ఉద్యమ ప్రస్థానం గురించి ప్రత్యేక కథనం..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పేందుకు చేపట్టిన సకల జనుల సమ్మె చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు అయిన జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు పట్టణం నుంచి పల్లె వరకు ప్రజలు సమ్మెలో పాల్గొన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర సాధనలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల నేతృత్వంలో పోరాటం 42 రోజుల పాటు ఉద్వేగభరితంగా సాగింది. రాజ్యాంగబద్దమైన కోరికతో నాగులున్నర కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్ష అని చెప్పాలి.
మన వనరులు మనక్కావాలి, మన ఉద్యోగాలు మనక్కావాలని, మన భాష, యాసను కాపాడుకోవాలని, మన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించు కోవాలని అంతిమంగా సీమాంధ్రుల పాలన నుంచి విముక్తి పొందేందుకు చేపట్టిన పోరాటంలో ఆర్టీసీ కా ర్మికులు, ఉద్యోగుల పాత్ర కీలకంగా నిలించింది. తెలంగాణ వ్యాప్తంగా 27 రోజుల పాటు 10,600 బస్సులు డిపోలకే పరమితం అయ్యాయి. తెలంగాణ ప్రాంతంలోని 56 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు, కా ర్మికులు సమ్మెలో పాల్గొన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ ప్రజా రవాణ వ్యవస్థను స్థంబింప చేయడంతో ఆర్టీసీ కార్మికులు తమ విధులకు దూరంగా ఉంచడంతో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.
ఆర్టీసీ కార్మికుల పోరాటం..
ఆర్టీసీ కార్మికులు పోరాటాలు చేసేందుకు ఎప్పుడు వెనకడుగు వేయలేదు. రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహిరించిన ఆర్టీసీ కార్మికులు రాష్ట్రం వచ్చిన తరువాత వారి సమస్యల సాధన కోసం 55 రోజుల పాటు సమ్మె చేసిన వారి ప్రధాన డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న లక్ష్యం మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ వారు మాత్రం వెనుకడుగు వెయలేదు. హైకోర్టులో ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన కేసును లేబర్ కోర్టుకు బదిలి చేసింది.
రెండు వారాల్లో సమస్యను పరిష్కరించాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వం దిగివచ్చిం ది. అంతే కాకుండా సమ్మెలో పాల్గొన్న కార్మికులను బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో తీసుకోవాలని ఆర్టీసీ జేఎసీ డిమాండ్ చేసింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తు న్నట్లు అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వ విలీనం ప్రక్రియ కేవలం ఎన్నికల స్టంట్‌గానే మిగిలిపోయింది. తమ హక్కుల కోసం స్వరాష్ట్రంలో చేసిన పోరాటంలో అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరు కార్మికులను భయబ్రాంతులకు గురి చేసింది.
ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఇతరత్ర ఇబ్బందులు త ట్టుకోలేక 34 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఎన్నో కష్టాలు పడ్డారు. స్వరాష్ట్రంలోను అవే కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫేస్టోలో పొం దుపరిచిన హామీలను ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఆర్టీసీకి సంబంధించిన డబ్బును ఆర్టీసీకి ఇవ్వలేదు. ఆర్టీసీ యూనియన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు రావాల్సి ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీని వాడుకున్న వారు అభివృద్ది చేయాల్సింది పోయి పూర్తిగా నిర్వీర్యం చేశారన్న ఆరోపణలున్నాయి.
చిప్ప సురేష్, కుమ్రంభీం ఆసిఫాబాద్
ఆర్టీసీ కార్మికుల ఆకాంక్షలు నెరవేర్చాలి!
ఆర్టీసీ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల ఆకాంక్షలను ప్రభుత్వాలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ పాత్ర చారిత్రాత్మకంగా నిలబడింది. స్వరాష్ట్రంలోను ఆర్టీని ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫేస్టులో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టడం లేదు. ఆర్టీసీలో యూనియన్లను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వంలో విలీన ప్రక్రియను ముందుకు తీసుకువేళ్లాలి. ఆర్టీసీకి చెందిన బాండ్ల డబ్బులను ఆర్టీసీకి చెల్లించాలి.
ఆశ్వద్ధామ రెడ్డి, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్
ఉద్యమంలో ఆర్టీసీ ప్రాముఖ్యత
రాష్ట్ర సాధనలో ఆర్టీసీ పాత్ర చాలా ఉంది. స్వరాష్ట్రం కోసం ఉద్యోగాలను పనంగా పెట్టి మరీ సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థను స్థంబింప చేయడంలో సఫలం అయ్యింది. బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రజలు సైతం స్వచ్ఛదంగా సమ్మెల్లో పాల్గొన్నారు.
విశ్వనాథ్, డీపో మేనేజర్, ఆసిఫాబాద్
స్వరాష్ట్రంలో కష్టాలు..
ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు పడ్డ కష్టం కంటే స్వరాష్ట్రంలో విధుల పరంగా అంత కంటే ఎక్కువ కష్ట పడుతున్నారు. డ్యూటీల పరంగా ఇబ్బందులు పడడంతో పాటు ఆర్థికంగాను కార్మికులకు నష్టం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కార్మికులకు నేటికి నిరాశనే మిగిలింది.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు అన్ని సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవడం లేదు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసేందుకు కార్యచరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
దివాకర్, రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు






