1 July, 2026 | 9:59 AM

సత్తాచాటిన సుకన్య

03-06-2024 01:38 AM

హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: ప్రపం చ మహిళల క్లాసిక్ బెంచ్ ప్రెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్ తేజావత్ సుకన్య సత్తాచాటింది. అమెరికా వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన సుకన్య ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల నుంచి 1200 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ టోర్నీలో సుకన్య అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. 76 కేజీల విభాగంలో బరిలోకి దిగిన సుకన్య అంతర్జాతీయ పోటీల్లో రాణించడం ఆనందంగా ఉందని పేర్కొంది.