1 July, 2026 | 9:16 AM

నయన పసిడి వెలుగులు

03-06-2024 01:40 AM

న్యూఢిల్లీ: తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్‌లో భారత లాంగ్ జంపర్ నయనా జేమ్స్ స్వర్ణ పతకంతో సత్తాచాటింది. ఆదివారం జరిగిన పోటీల్లో నయన 6.43 మీటర్ల దూరం లంఘించి అగ్రస్థానం దక్కించుకుంది. ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ లెవల్ ఈవెంట్ మూడో ప్రయత్నంలో నయన తన అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. భారత దేశం వెలుపల నయనకు ఇదే బెస్ట్ కాగా.. తన వ్యక్తిగత రికార్డు (6.67 మీటర్లు)ను మాత్రం దాటలేకపోయింది. ఇటీవల ఫెడరేషన్ కప్‌లో స్వర్ణం గెలిచిన నయన.. ఇక్కడ కూడా అదే జోరు కొనసాగించింది. పురుషుల 200 మీటర్ల రేసులో అనిమేశ్ పసిడి పతకంతో మెరిశాడు. 20.59 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన అనిమేశ్ టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు.