03-01-2026 01:05:05 PM
కరీంనగర్,(విజయక్రాంతి): ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవణ్ కళ్యాణ్ శనివారం ఉదయం కొండగట్టు పుణ్య క్షేత్రానికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి కొండగట్టు జె ఎన్ టి యూ కు చేరుకొని అక్కడి నుండి అంజన్న క్షేత్రానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ కు సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వాగతం పలికారు. తొలుత ఎపి డిప్యూటీ సి ఎం పవన్ కల్యాణ్ పోలీసుల గౌరవవందనం స్వీకరించారు.