calender_icon.png 21 July, 2025 | 4:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణను త్వరగా అమలు చేయాలి

11-08-2024 12:59:04 AM

మంద కృష్ణ మాదిగ 

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్రాలు త్వరగా అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కోరారు. ఈ రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్ధిష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. శనివారం ఢిల్లీలో మందకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాకారంతో మోదీ, అమిత్‌షా పాత్ర ఎంతో ఉందని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తిచేశారు.

సుప్రీంకోర్టు ధర్మాసనంలో ప్రతి జడ్జికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్లు దాటినా రిజర్వేషన్ ఫలాలు చాలా కుటుంబాలకు అందలేదని, వర్గీకరణకు మద్దతుగా నిలిచిన ప్రతి నాయకుడి మేలు మరిచిపోలేమన్నారు. దక్షిణాదిలోని నలుగురు ముఖ్యమంత్రులు స్వాగతించారని, సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ సీఎం చంద్రబాబు ముందుగానే స్పందించి స్వాగతించినట్టు చెప్పారు.