11-08-2024 01:06:24 AM
హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త అంగన్ వాడీ సెంటర్లను మంజూరుచేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. అంగన్‌వాడీ సెంటర్లలో మెరుగైన సేవలు అందిస్తు న్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహకారాన్ని పెంచాలని కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాల మహిళా సంక్షేమ శాఖ మం త్రులతో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లోని సంబంధిత శాఖలో అమలవుతున్న పథకాలు, ఎదురవుతున్న సవాళ్లను అడిగి తెలుసుకున్నారు.
సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న మంత్రి సీతక్క.. తెలంగాణలో మహిళా శిశు సంక్షేమ శాఖ అవసరాలను కేంద్రం ముందుంచారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లకు మొబైళ్ల స్థానంలో ట్యాబ్‌లు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్‌వాడీ కేంద్రాల్లో ౭ నెలల నుంచి 6 సంవ త్సరాల మధ్య వయసు గల 14,83,940 చిన్నారులకు, 3,45,458 మంది గర్భిణీ, బాలింతలకు సేవలందిస్తున్నట్టు తెలిపారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చామని చెప్పారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా చిన్నారులకు యూనిఫాంలు ఇవ్వబోతున్నట్టు తెలి పారు. అంగన్‌వాడీ టీచర్లకు నెలకు రూ.13,650, ఆయాలకు రూ.7800 చొప్పున గౌరవ వేతనం అందజేస్తున్నామని, వారి వేతనాల్లో కేంద్రం వాటాను పెంచాలని కోరారు. మంత్రి సీతక్క ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. కొత్త అంగన్‌వాడీ సెంటర్ల మంజూరుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
మహిళలపై అఘాయిత్యాలను ఉపేక్షించబోం
మలక్‌పేట ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్‌లో బాలికపై లైంగిక దాడి జరగలేదని తాను అసెంబ్లీలో చెప్పినట్టు జరుగుతున్న ప్రచారాన్ని సీతక్క ఖండించారు. ఆ రోజు అధికారులిచ్చిన సమాచారాన్ని మాత్రమే తాను ప్రస్తావించినట్టు తెలిపారు. కేసు పురోగతిపై మంత్రి శనివారం సచివాలయంలో మహిళాశిశు సంక్షేమశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కలెక్టర్ అనుదీప్, వికలాంగుల సాధికార సంస్థ డైరెక్టర్ శైలజ, త్రి సభ్య విచారణ కమిటీ సభ్యులు, అధికారులతో సమీక్షించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిం దని, బాధిత కుటుంబానికి అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నట్టు మంత్రి దృష్టికి తీసు కొచ్చారు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్టు తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలను ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు.