calender_icon.png 8 December, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యుడు ఎల్లయ్యకు సన్మానం..

07-12-2025 04:30:47 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మంచిర్యాల జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఇటీవల ఎన్నికైన బీజేపీ జిల్లా నాయకులు దుర్గం ఎల్లయ్యను ఆదివారం బెల్లంపల్లి బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జి గోమాస శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి ఘనంగా సన్మానించారు. దుర్గం ఎల్లయ్యను ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యునిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఇటీవలనే ఉత్తర్వులు జారీ చేశారు. దళితుల సమస్యల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎల్లయ్యను ఆ పదవిలో నియమించడం హర్షణీయం అన్నారు. ఆయన ఎన్నికైనందుకు అభినందించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం కృషి చేయాలని సూచించారు.