calender_icon.png 8 December, 2025 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువజన సంఘం యువకుల ఆర్థిక సహాయం..

07-12-2025 04:29:23 PM

పాపన్నపేట (విజయక్రాంతి): మండల పరిధిలోని రామతీర్థం గ్రామానికి చెందిన అంబేద్కర్ ఆదర్శ యువజన సంఘం యువకులు ఆదివారం గ్రామంలోని ఇరు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. సంఘం వినోద-ప్రభాకర్ దంపతులు ఇటీవల మృతిచెందగా వారి ఇద్దరు చిన్నారులు దీపిక, అంజలి అనాధలయ్యారు. కాగా వారికి యువజన సంఘం తరఫున రూ.4 వేలు అందించారు. అలాగే కుటుంబ పెద్దయిన ఎరుకల ఎల్లయ్య మృతిచెందగా వారి కుటుంబానికి రూ.3వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు వెంకటేశం, ఉపాధ్యక్షుడు కృష్ణ, జనరల్ సెక్రటరీ ప్రసాద్, బాబు, సభ్యులు మచ్చేందర్, బాగయ్య, దశరథ్, శేఖర్, బన్నీ, భాను, శ్రీశైలం, సురేష్, అనిల్, శ్రీకాంత్, స్వామి, జాను తదితరులు ఉన్నారు.