calender_icon.png 6 August, 2025 | 5:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ఉద్యమాల నిర్మాణంలో గద్దర్ ది ఎనలేని పాత్ర

06-08-2025 02:30:54 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రజలను పాలకవర్గాల దోపిడీ, దౌర్జన్యాలపై చైతన్యవంతం చేసి ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో ప్రజాయుద్ధనౌక గద్దర్(Gaddar) ఎనలేని పాత్ర పోషించారని టి ఎన్ టి యు సి నాయకులు మని రామ్ సింగ్ అన్నారు. బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గద్దర్ మూడవ వర్ధంతి కార్యక్రమాన్ని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతరాన్ని విప్లవోద్యమం వైపు నడిపించడం లో గద్దర్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు దోహదం చేశాయని అన్నారు. తెలంగాణ సాధనలో ఆయన ఆట, మాట, పాట ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా గద్దర్ చిత్రపటానికి పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు నీరటి రాజన్న, ఐ ఎఫ్ టి యు నాయకులు ఎండి చాంద్ పాషా, టి యు సి ఐ నాయకులు గోగర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.