calender_icon.png 6 August, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

06-08-2025 02:25:20 PM

రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా

బిచ్కుంద,(విజయ క్రాంతి): అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను డోంగ్లి రెవెన్యూ అధికారులు బుధవారం పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం సిర్పూర్ వద్ద మంజీర నది నుంచి వస్తున్న ట్రాక్టర్ను తనిఖీ చేయగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా తెలిపారు. తదుపరి చర్యల కోసం ట్రాక్టర్ను తహశీల్దార్ కార్యాలయానికి తరలించామన్నారు.