06-08-2025 02:36:16 PM
బిసిలకు రిజర్వేషన్ లు ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే లు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి
మహబూబ్నగర్, (విజయక్రాంతి): బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం(Central Government) చేస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Mahbubnagar MLA Yennam Srinivas Reddy), అనిరుద్ రెడ్డి లు అన్నారు. బుధవారం బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో చేపట్టిన పోరు బాట మహాధర్నాలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మా నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసిన సందర్భంగా బడుగు బలహీన వర్గాల ప్రజల స్థితిగతులను స్వయంగా ఆయన గమనించారని, వారికి విద్య , ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కాకుండా చట్టసభల్లో సైతం రిజర్వేషన్లు అవసరమని ఆయన భావించారని అందుకే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మెనిఫెస్టో లో బిసిలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని హామి ఇచ్చామని గుర్తు చేశారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బిసిలకు రిజర్వేషన్ అమలు చేసి వారికి రాజ్యాధికారం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) రాష్ట్రంలో కుల గణన చేయించి, నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి, వారితో చర్చించి, అసెంబ్లీ లో బిసి రిజర్వేషన్ బిల్లు పెట్టి, బిసిలకు రిజర్వేషన్ ఆవశ్యకత పైన చర్చించి , అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బిసి రిజర్వేషన్ బిల్లు ఆమోదించి, కేంద్రానికి పంపించామని , కేంద్రంలో ఉన్న బిజేపి ప్రభుత్వం బిసిల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని, వారికి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలన్నా, వారు చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించాలన్నా రిజర్వేషన్లు అవసరమని ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు , మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , ఎంపిలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.