calender_icon.png 6 August, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డు అందుకున్న సిద్దిపేట వాసి

06-08-2025 02:23:47 PM

సిద్దిపేట రూరల్: సిద్ధిపేట జిల్లా(Siddipet resident) గుర్రాలగొంది గ్రామానికి చెందిన బామండ్ల లక్ష్మి-మల్లయ్య కుమారుడైన బామండ్ల రాజుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం(Osmania University) డాక్టరేట్ ప్రకటించింది.నిరుపేద కుటుంబంలో పుట్టి చదువు మాత్రమే తన బ్రతుకును ఉన్నతంగా మార్చగలదని నమ్మి, ప్రైవేట్ ఉద్యోగం వదిలేసి ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన పిజి తెలుగు ఎంట్రెన్స్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో  6వ ర్యాంక్ సాధించాడు బామండ్ల రాజు. ఆ తర్వాత పీజీ తెలుగు పూర్తయ్యలోపు యూజీసీ నిర్వహించిన నెట్ పరీక్షలలో ఆల్ ఇండియా టాప్ టెన్ లోJRF (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్) గా సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత JNTU నిర్వహించిన గురుకుల  పీజీటీ తెలుగు పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 12 ర్యాంక్ సాధించాడు.TRT ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 వ ర్యాంకు సాధించాడు.

ఆ తర్వాత JNTU నిర్వహించిన గురుకుల JL తెలుగు పరీక్షలో  రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించి తన సత్తా చాటాడు.అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో "నీలా జంగయ్య కవిత్వం - సమగ్ర పరిశీలన"అనే అంశం పైన వెలుదండ నిత్యానందరావు గారి పర్యవేక్షణలో పిహెచ్.డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందాడు.ఈ నెల 19న ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న 84వ స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ వర్మ మరియు ఇస్రో చైర్మన్ డా.వి. నారాయణన్ చేతుల మీదుగా డాక్టరేట్ తీసుకోబోతున్నారు.ప్రతిభకు పేదరికం అడ్డు కాదని,కృషి,పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చుని నిరూపించాడు.అధ్యాపకులు బామండ్ల రాజుకు ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ రావడంతో తల్లిదండ్రులు,బంధుమిత్రులు,సహోపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.