06-08-2025 02:20:53 PM
కామారెడ్డి,(విజయ క్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని(Jayashankar Jayanthi) పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని రైల్వే బ్రిడ్జి, ప్రొబెల్ స్కూల్ వద్ద గల జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పోరాట స్ఫూర్తి మరువలేనిదని గుర్తు చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, కామారెడ్డి నియోజకవర్గ అధికార ప్రతినిధి గైని శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ హఫీస్ బేగ్, మాజీ కౌన్సిలర్లు గేరుగంటి లక్ష్మీనారాయణ, మాసుల లక్ష్మీనారాయణ, సంగి మోహన్, మల్లేష్ యాదవ్ నాయకులు జగదీష్ యాదవ్, నర్స గౌడ్, ఆనందరాములు, రమణరావు, కృష్ణ యాదవ్, శ్యామ్, ముఖిత్, లత, పృథ్వి రాజ్ తదితరులు పాల్గొన్నారు.