06-08-2025 02:33:23 PM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి
ఢీల్లీ, జంతర్ మంతర్ నిరసనలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మూడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్
మహబూబ్నగర్,(విజయక్రాంతి): బీసీలకు న్యాయం చేయాలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే ఆమోదించవలసింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని మహబూబ్నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ లు అసహనం వ్యక్తం చేశారు. బుధవారం ఢిల్లీలోని జంతర్ మద్దతు దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి వారు హాజరై తమ నిరసనను కొనసాగించారు. బీసీలకు సముచిత స్థానం కల్పించాలంటే 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై అవసరమైనా చర్యలు తీసుకోవాల్సిందంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరాజ్ ఖాద్రీ, తదితరులు ఉన్నారు.