calender_icon.png 14 August, 2025 | 11:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సార్లు లేరని స్కూల్‌కు తాళం

07-08-2025 01:47:16 AM

కుభీర్, ఆగస్టు 6: 55 మంది విద్యార్థులకు ఒక్క టీచరే ఉన్నాడని, జిల్లా విద్యా అధికారులు స్పందించి అదనంగా ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని సాంగ్వి లో గ్రామస్థులు, విద్యార్థులు స్కూల్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు గడిచినా సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులను నియమించడంలో అధికారులు విఫలమయ్యా రని ఆరోపించారు.

దీంతో పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి లోగా టీచర్లను పంపకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. జూన్‌లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి మీ పిల్లలను ప్రైవే ట్‌కు పంపొద్దని ఇక్కడే నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పి, ఇప్పుడు టీచర్లు నియమించకపోగా తమ పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం, అధికారులు ఆటలాడుకుంటున్నారని దుమ్మెత్తి పోశారు.