07-08-2025 01:48:43 AM
హైదర్‌షాకోట పీహెచ్‌సీని సందర్శించిన డాక్టర్ సత్యరత్న
నార్సింగి, ఆగస్టు 6 (విజయక్రాంతి): నార్సింగి వైద్య అధికారి డాక్టర్ సత్యరత్న బుధవారం హైదర్‌షాకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి కీలక ప్రజారోగ్య కార్యకలాపాలు, అవగాహన కార్యక్ర మాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆగస్టు 11న జరుపుకొనే జాతీయ డీవార్మింగ్ దినోత్సవంపై గంధంగూడలోని ఎంపీపీఎస్ పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లల్లో పారాసైట్లు తొలగించడం ద్వారా ఆరోగ్యం, పోషణ మెరుగువుతుందని వివరించారు.
ఆగస్టు మొదటివారంలో జరుపుకొనే ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై ఆరోగ్య విద్యా సెషన్లు నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లి పాల వల్ల శిశువుకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని, తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఆమె వివరించారు. నార్సింగి పరిధిలోని అన్ని పాఠశాలల్లో త్వరలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ధీరజా, టీ అమృత, సిబ్బంది సరస్వతి, ఆశా కార్యకర్తలు ఎం రామ, వై అరుణ, డీ సుమలత పాల్గొన్నారు.