calender_icon.png 21 September, 2025 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కొడంగల్, సుల్తాన్‌పూర్‌లో సైన్స్‌సెంటర్లు

30-11-2024 01:13:00 AM

ఒక్కో సెంటర్‌కు రూ.6.65కోట్లు

హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాం తి): వికారాబాద్ జిల్లా కొడంగల్, సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ క్యాంపస్‌లో సైన్స్ సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది.  ఒక్కో సెంటర్‌ను రూ.6.65 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు, మంత్రి దామోదర రాజనరసింహ సూచనలతో సైన్స్‌సెంటర్ల ఏర్పాటుకు ఎన్విరాన్మెంట్, ఫారెస్టు, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ పరిపాలన అనమతులు ఇస్తూ జీవో విడుదల చేసింది.