శాస్త్రీయ విద్యావిధానమే అంతిమలక్ష్యం ఏఐఎస్‌ఎఫ్
అశ్వాపురం, నవంబర్ 5, (విజయ క్రాంతి): విద్య వ్యాపారీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు ఐక్యంగా ముందుకు రావాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ పిలుపు నిచ్చారు. అశ్వాపురం మండలంలో బుధవారం జరిగిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) ముఖ్య కార్యకర్తల స మావేశంలో ఆయన మాట్లాడుతూ, శాస్త్రీయ విద్య విధానమే విద్యార్థుల నిజమైన భవిష్యత్తును నిర్ధారిస్తుంది.
విద్య వ్యాపారంలా మా రిపోతోందని, దీనిని అడ్డుకోవడం కోసం విద్యార్థుల ఐక్యత అవసరం అని పేర్కొన్నా రు. అజిత్ మాట్లాడుతూ రేపు అశ్వాపురం మండల కేంద్రంలో జరగబోయే ఏఐఎస్‌ఎ ఫ్ మండల మహాసభలను జయప్రదం చే యాలని విద్యార్థులను కోరారు. ఈ మహాసభలో తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వ విద్యా రంగ సమస్యల పరిష్కారానికి దోహదం చే స్తాయని తెలిపారు.
ప్రభుత్వం విద్యా రం గంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి, ప్రైవేటీకరణ విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ ఉద్య మాలలో ప్రతి విద్యార్థి పాల్గొని ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అక్కెనపల్లి నాగేంద్రబాబు, మండల నాయకులు పడిదల నిఖిల్, రమ్య, మౌనిక, సౌజన్య తదితరులుపాల్గొన్నారు.






