06-11-2025 12:27:14 AM
మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు బట్టు సురేష్, రంగన్న
ఆళ్ళపల్లి, నవంబర్ 5, (విజయక్రాంతి) రైతులు కష్టపడి పండించిన వరి పత్తి మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర ను కల్పించాలని, మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, భద్రాద్రి జిల్లా ఏఐకేఎంఎస్ జి ల్లా నాయకులు బట్టు సురేష్, మండల కార్యదర్శి పూనెం రంగన్నలు డిమాండ్ చేశారు.
తొలుత రైతులతో మండల కేంద్రం లో ఏఐకేఎంఎస్ డివిజన్ నాయకులు బత్తిని సత్యం అధ్యక్షత న నిరసన ర్యాలీ ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో అకాల వర్షాలు కురవడం తో ఆరుగాళ్లు కష్టపడి పండించిన ప్రత్తి, వరి, మొక్కజొన్న పం టలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
అన్నిరకాల పంటలను మద్దతుధరలతో కొనుగోలుచేయాలని, మార్కోడు, రామాంజిగూడెం, ఆళ్ళపల్లి, అనంతోగు గ్రామా ల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కోతులకు కు టుంబ నియంత్రణచేసి కోతుల నుండి పంటనష్టాలను నివారించాలన్నారు. తడిచిన ధాన్యం, మొక్కజొన్న కొనుగోలుచే యాలని డిమాండ్ చేశారు.
రైతులు కష్టపడి పండించిన పం టలు చేతికొచ్చేదశలో అకాలంగా కురుస్తున్న తీవ్రంగా నష్టపోయారని ఆవేదనలు వ్యక్తం చేశారు. లక్షల రూపాయల అప్పు లుచేసి పెట్టుబడులతో పండించిన పంటలు వర్షాలవల్ల తడిసి మొలకెత్తి కొన్నిచోట్ల పాక్షికంగా కొన్నిచోట్ల పూర్తిగా దెబ్బ తిన్నాయని తెలిపారు. నష్టపోయిన పంటలను ప్రభుత్వం సర్వేచేసి రైతులను ఆదుకోవాలని, తడిచిన ధాన్యాన్ని షరతులు లే కుండా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
మధ్య దళారీల దోపిడీని అరికట్టి రైతులను ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 10న చలో కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి జయప్రధం చే యాలని పిలుపు నిచ్చారు.. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో డివిజన్,నాయకులు.మెస్సుగోపాల్, అటికం శేఖర్, పూనెం లక్ష్మణ్, మంగ, పూనెం లక్ష్మన్, రాంబా బు, ముత్తక్క, శిరోమణి, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.