06-11-2025 12:30:33 AM
కొత్తగూడెం, నవంబర్ 5, (విజయక్రాంతి):పీవీకే 5పరిధిలో అడవిలో ఏర్పాటు చేసిన 5బి బోర్ హోల్స్ లో సరిపడా సిబ్బందిని నియమించాలని ఐ.ఎన్.టి.ఎస్.సి వైస్ ప్రెసిడెంట్ రజాక్ యాజమాన్యాన్ని కోరారు. బుధవారం బోర్ వెల్స్ ప్రాంతాన్ని పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీవీకే 5 గని పరిధిలో గని నుండి సుమారు, మూడు నుండి నాలుగు కిలోమీటర్ ల దూ రంలో దట్టమైన అడవిలో నాలుగు బోర్ హోల్స్ ను ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ బోర్ హోల్స్ నుండి ఫిల్టర్ బెడ్ కు నీటిని తీసుకొచి కాలనీలకు సరఫరా చేస్తారు. ఆ బోర్ హోల్స్ వద్ద సరిపడ సిబ్బందిని ఏర్పా టు చేయకపోవడం వల్ల, ఒంటరిగా పనిచేసే కార్మికులు బిక్కు బిక్కుమంటూ భయం భ యంగా విధులు నిర్వర్తించవలసి వస్తున్నది. గని యాజమాన్యం, ఎస్ &పీసీ డిపార్ట్మెంట్ లలో, సరిపడ సిబ్బందిని ఏర్పాటు చేయాలనీ ఆయన మేనేజర్ శ్యామ్ ప్రసాద్ ను కోరారు. అనంతరం గనిలో కార్మికులు ఎదురుకొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.