calender_icon.png 9 May, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదాతలకు అండగా శాస్త్రవేత్తలు

08-05-2025 12:28:40 AM

కోయిల్ కొండ మే 7 : పంట దిగుబడి పెంచేందుకుగాను రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అవసరమైన మెలకువలు చెప్పేందుకు శాస్త్రవేత్తలు అండగా నిలుస్తున్నారని ఎల్డీ ఎం భాస్కర్ అన్నారు.  బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో  మండలం లోని రైతు రైతు వేదిక లో రైతులకు పంట సా గులపై శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎల్లప్పుడూ అవసరమైన సమయంలో పంటలను పండిస్తేనే మంచి దిగుబడి లభిస్తుందని స్పష్టం చేశారు. ఈ వానాకాలం ప్రారంభంలోనే రైతులకు వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు సంబంధించి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో  ప్రాంతీయ వ్యవసాయ పరిశోదన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ కే సదయ్య, డాక్టర్ వి. దివ్య రాణి, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్,  పి. శ్రీనివాసులు, ఉద్యానవన అధికారిణి స్వప్న, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ బి. నరేష్, ఎల్ డి ఎం  కె. భాస్కర్,  వ్యవసాయ విస్తరణ అధికారులు, ఆది నారాయణ రెడ్డి  రైతులు పాల్గొన్నారు.