calender_icon.png 9 May, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైటెక్‌సిటీ కేర్ హాస్పిటల్‌లో ‘మామ్’ ఓరబుల్ సెలబ్రేషన్స్

08-05-2025 12:28:05 AM

హైదరాబాద్, మే 7(విజయక్రాంతి): మే 11న అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పు రస్కరించుకొని తల్లుల గొప్పదనాన్ని చాటే లా హైటెక్‌సిటీలోని కేర్ హాస్పిటల్స్‌లో ఎ మామ్ ఓరబుల్ సెలెబ్రేషన్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాని కి ఎలికో లిమిటెడ్ వైస్-చైర్పర్సన్, ఎండీ డాక్ట ర్ వనిత దాట్ల ముఖ్యఅతిథిగా హాజరై, మా తృమూర్తుల శ్రమ, మమకారం, శక్తి గురిం చి మాట్లాడారు.

కార్యక్రమంలో కేర్ హాస్పిట ల్స్, హైటెక్ సిటీ సీవోవో నీలేశ్ గుప్తా, సీనియర్ ఓబ్ట్సెట్రిషియన్, గైనకాలజిస్ట్ డాక్టర్ ఎస్‌వీ లక్ష్మి, సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శైలజ కంభంపాటి హాజరై తల్లుల ఆరోగ్యం, కుటుంబాల్లో వారి పాత్ర గురించి ముఖ్యం గా తెలియజేశారు. కార్యక్రమంలో పిల్లల కో సం ఆటలు, వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. జ్యోతిపప్రజ్వలనతో ప్రారంభమై న కార్యక్రమంలో నీలేశ్ గుప్తా ప్రారంభ ప్ర సంగం చేశారు.

ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్స్ మదర్స్ హెల్త్ అనే ప్రత్యేక ఆరోగ్య ప్యా కేజ్‌ను విడుదల చేసింది. ఈ సందర్బంగా వ నిత దాట్ల మాట్లాడుతూ, తల్లి అవడం అంటే పూర్తిగా సమయాన్ని కేటాయిం చేపని, జీవితాంతం ఉండే బాధ్యత.

తల్లులు కుటుంబం, సమాజానికి చేసే గొప్ప సేవను గుర్తించి, కేర్ హాస్పిటల్స్ లాంటి సంస్థలు ఇ లా వేడుకలు జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. నీలేశ్ గుప్తా మాట్లాడుతూ. కేర్ హాస్పిటల్స్ లో కేవలం వైద్యం ఇవ్వడమే కాకుండా జీవితం, ఆరోగ్యం, సంబంధాలను కూడా గౌరవిస్తామన్నారు.