1 August, 2026 | 1:06 AM

విద్యుత్ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్‌ఈ

01-08-2026 12:00 AM

సికింద్రాబాద్, జూలై 31 : శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆషాడ జాతర {లష్కర్ బోనాల పండుగ}ను పురస్కరించుకొని  విద్యుత్ శాఖ చేస్తున్న ఏర్పాట్లను సికింద్రాబాద్ ఎస్.ఈ గోపయ్య  పరిశీలించారు. ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ప్యారడైజ్ డివిజనల్ ఇంజనీర్ బ్రహ్మనందం, ఏడీఈ శివ దుర్గాప్రసాద్, ఏఈ కాసం రవికుమార్, జనరల్ బజార్ సిబ్బంది తదితరులు ఉన్నారు.