1 August, 2026 | 1:07 AM

పెద్ది సుదర్శన్ రెడ్డికి.. నిరంజన్ రెడ్డి నివాళి

01-08-2026 12:00 AM

వనపర్తి టౌన్, జూలై 31: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తన నివాసంలో పెద్ది చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, సుదర్శన్ రెడ్డి నిబద్ధత కలిగిన ఉద్యమకారుడిగా, ప్రజల కోసం నిరంతరం పనిచేసిన నాయకుడిగా కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, బీఆర్‌ఎస్ శ్రేణులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.