దోమల వ్యాప్తిని అరికట్టాలి
01-08-2026 12:00 AM
వనపర్తి టౌన్, జూలై 31: దోమల వ్యాప్తికి కారణమయ్యే నీటి నిల్వలను పూర్తిగా తొలగించి డ్రైనేజీలు, కాలువలు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం వనపర్తి పట్టణంలోని తెలుగువాడ ప్రాంతంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. పారిశుద్ధ్య చర్యలు, ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలను పరిశీలించిన కలెక్టర్, ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అలాగే కాలనీలు, వీధుల్లో చెత్త పేరుకుపోకుండా సకాలంలో తొలగించి పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలని అధికారులను ఆదేశించారు.






