calender_icon.png 10 July, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోపోర్‌లో రెండో రోజు సెర్చ్ ఆపరేషన్

20-01-2025 11:35:40 AM

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని సోపోర్ ప్రాంతంలోని అడవుల్లో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్(Anti terrorist operation) సోమవారం రెండో రోజుకు చేరుకుంది. భద్రతా దళాలు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు. సోపోర్ పోలీసు(Sopore Police) జిల్లాలోని జలూరా గుజ్జరపతి ప్రాంతంలో భద్రతా బలగాలు గట్టి వలయాన్ని నిర్వహించాయి.ఈ ఉదయం ఆ ప్రాంతంలో అనుమానిత ఉగ్రవాదుల కోసం సోదాలు ముమ్మరం చేసినట్లు అధికారి తెలిపారు. ఉగ్రవాదుల స్థావరాన్ని వెలికితీస్తుండగా కాల్పులు జరగడాన్ని భద్రతా బలగాలు గమనించడంతో ఆదివారం నాడు చుట్టుముట్టినట్లు వారు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.