09-11-2025 08:15:07 PM
హుజూర్‌నగర్/చింతలపాలెం: చిన్న చిన్న సరదాలు ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తుంటాయి. అలాంటి ఘటనే సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హుజూర్ నగర్ మండల పరిధిలోని లింగగిరి గ్రామానికి చెందిన ముజాహిద్దీన్ తన స్నేహితులతో కలిసి పులిచింతల ప్రాజెక్టు వద్దకు సరదాగా ఆదివారం సెలవు దినం కావడంతో వెళ్లారు. పులిచింతల ప్రాజెక్టు సమీపంలో ఆంధ్రప్రదేశ్ దిగువ వైపు సరదాగా గడుపుతూ ఉండగా ప్రమాదవశాత్తు నీటిలో జారీపడి గల్లంతయ్యాడు.
దీంతో అతని స్నేహితులు స్థానికులు పోలీస్ శాఖ వారికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, కోదాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది ప్రాజెక్టు వద్దకు చేరుకొని గల్లంతైన ముజాహిద్దీన్ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనతో లింగగిరి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.