calender_icon.png 6 August, 2025 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిఫా ఫుట్‌బాల్ అకాడమీకి భువనేశ్వర్ ఎంపిక

06-08-2025 01:50:50 AM

గ్లెండేల్ అకాడమీ, సన్‌సిటీలో 9వ తరగతి చదువుతున్న భువనేశ్వర్

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 5 (విజయక్రాంతి): గ్లెండేల్ అకాడమీ, సన్‌సిటీలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి రుద్రాక్ష్ బన్సాల్ భువనేశ్వర్, ఒడిశాలోని ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఫిఫా ఫుట్‌బాల్ అకాడమీకి ఎంపికయ్యాడు. దేశవ్యాప్తంగా ఉన్న వందల మంది ఆశావహ ఆటగాళ్ల మధ్య ఐదు కఠినమైన ఎం పిక దశల్ని అధిగమించిన తర్వాత, రుద్రాక్ష్ ఈ గౌరవాన్ని పొందిన తెలంగాణ రాష్ర్టం నుంచి ఏకైక విద్యార్థిగా నిలిచాడు.

అతడు దేశవ్యాప్తంగా ఎంపికైన మొత్తం 19 మంది ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. రుద్రాక్ష్ విజయాన్ని ప్రశంసిస్తూ, గ్లెండేల్ స్కూల్స్ ఇండియా డైరెక్టర్ మినూ సలూజా మాట్లాడుతూ.. ఐఫా ఫిఫా అకాడమీకి రుద్రాక్ష్ ఎంపిక కావడం అతని పట్టుదల, క్రమశిక్షణ, ఆటపై అతని అపారమైన ఆసక్తికి ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. ఇది కేవలం వ్యక్తిగత విజయమే కాదు గ్లెండేల్‌కు గర్వకార ణమైన ఘనత అని చెప్పారు.

అతడికి అండగా ఉంటామని చెప్పారు. ఐఫా ఫిఫా అకాడమీకి ఎంపిక కావడంతో తన కల నిజమైందని భువనేశ్వర్ అన్నాడు. రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహించడం, దేశవ్యాప్తంగా ఎంపికైన 19 మందిలో ఒకడిగా ఉండడం అద్భుతమైన గౌరవంగా భావిస్తున్నాని చెప్పాడు. మెంటర్‌లు, గ్లెండేల్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు.