ఇండియా కూటమికి 300 సీట్లు
రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తేజావత్ బెల్లయ్యనాయక్
కామారెడ్డి, మే 10 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి 300 సీట్లు వస్తాయని రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తేజావత్ బెల్లయ్యనాయక్ ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాకేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదన్నారు. నిరుద్యోగ సమస్యను పట్టించుకోనందున ఇప్పుడు యావత్ దేశ యువత కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని ప్రజలు చూస్తున్నారన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన జోడో యాత్ర, న్యాయ యాత్రతో ఉత్తర భారతంలో పార్టీ మరింత బలోపేతం అయిందన్నారు. కే్రంంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తొలగిస్తుందన్నారు.
ఇప్పటికే జాతి ఆస్తులను అంబానీ, అదానీలకు కట్టబెట్టిందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్టీ సెల్ నేత రాణాప్రతాప్ రాథోడ్, లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ నునావత్ గణేష్‌నాయక్, నాయకులు పూల్‌చంద్ నాయక్, నరేష్ రాథోడ్, నునావత్ శ్రీనివాస్, వినోద్‌నాయక్, నౌసీలాల్ నాయక్, మోతీలాల్ నాయక్, అంబర్‌సింగ్, రాజూనాయక్, పీర్‌సింగ్ నాయక్, అశోక్‌రాథోడ్, శంకర్‌నాయక్, మాన్‌సింగ్ నాయక్ పాల్గొన్నారు.






