ఓటమి భయంతోనేనా..?
అందోల్‌లో కనిపించని గాలి అనిల్ కుమార్
నియోజకవర్గంలో అంతంత మాత్రమే ప్రచారం
స్థానిక ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సైతం ప్రచారానికి దూరం
అందోల్, మే 10: పార్లమెంటు ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. అయితే, ఇప్పటివరకు బీఆర్‌ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ జహీరాబాద్ సెగ్మెంట్‌లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించినప్పటికీ అందోల్‌లో మాత్రం కనిపించలేదు. దీనిపై నియోజకవర్గ ప్రజల నుంచి రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి.
బీఆర్‌ఎస్ పార్టీ అసలు గెలుస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనిల్‌కుమార్ మాత్రమే కాదు పార్టీ అగ్రనేతలు సైతం అందోల్ వైపు చూడలేదు. ఇప్పటికీ కాంగ్రెస్‌లో చేరికలు కొనసాగుతున్నాయి. దీంతో బీఆర్‌ఎస్‌లో బలమైన నా యకత్వం కరువైంది. క్యాడర్ లేక ప్రచారం అంతంత మాత్రమే అన్నట్టు ఉంది.
మాజీ ఎమ్మెల్యే సైతం..
అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సైతం ప్రచారంలో అడపాదడపా మాత్రమే కనిపిస్తున్నట్లు టాక్. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు గట్టిగా పనిచేస్తున్నారు. క్రాంతికిరణ్ మాత్రం గెలుపుకోసం ప్రయత్నించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.






