calender_icon.png 11 November, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతరాష్ట్ర సరిహద్దులో భద్రత పటిష్టంగా ఉండాలి: తాహశీల్దార్ మంగా

11-11-2025 08:09:58 PM

మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల సరిహద్దులను మంగళవారం మఠంపల్లి తాహశీల్దార్ లావురి మంగా అధికారులతో కలిసి చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తాహశీల్దార్ మాట్లాడుతూ అంతరాష్ట్ర సరిహద్దులో భద్రత పటిష్టంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వరి ధాన్యంను రాకుండా అరికట్టాలని, పిడిఎస్ సన్న బియ్యం సరిహద్దు దాటకుండా చూడాలని సూచించారు. వారి వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివ, సిబ్బంది తదితరులు ఉన్నారు.