11-11-2025 08:12:07 PM
ఆళ్ళపల్లి (విజయక్రాంతి): యూనియన్ బ్యాంక్ ఆవిర్భవించి 106 సంవత్సరాలు ముగించుకొని 107వ సంవత్సరంలోకి అడుగిడుగుతున్న సందర్భంగా మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బ్యాంకు సేవలను ఉపయోగించుకోవాలన్నారు. ప్రభుత్వ రాయితీలు తదితర బ్యాంక్ సేవలను వినియోగించుకొని లబ్ధిపొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ యాల్ల సురేష్, క్యాషియర్ బి.యల్.రామ్ రాథోడ్, సీఎస్ఏ ఏం.శ్రీనివాసరావు, అటెండర్ ప్రభాకర్, వ్యాపారస్తులు గౌరిశెట్టి శ్రీనివాసరావు అనుమోల వెంకటేశ్వరరావు బూరుగడ్డ వెంకటేశ్వర్లు సిరి నోముల నరేష్ తదితరులు పాల్గొన్నారు