11-11-2025 08:07:46 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో డబ్బుల వ్యవహారం రచ్చకెక్కడంతో మంగళవారం ఇందిరమ్మ పథకం పిడి బన్సీలాల్ నాయక్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఎంపికైన లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నిరుపేదలైన అర్హులకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించేలా చర్యలు చేపడతామని చెప్పారు. పిడి బన్సీలాల్ నాయక్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలిస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు నాతరి స్వామి, బండి ప్రభాకర్, ఎండి అనీఫ్, బిఆర్ఎస్ నాయకులు జిల్లపల్లి వెంకట స్వామిలు ఉన్నారు.