హైదరాబాద్ జిల్లాలో 23.84 కోట్లు సీజ్
జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఇప్పటి వరకూ వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా రూ.23.84 కోట్ల నగదు, 27,715 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ తెలిపారు. వీటితోపాటు రూ.26.03 కోట్ల విలువ చేసే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అరికట్టడంలో భాగంగా 354 మందిపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేసినట్టు వివరించారు. ఇప్పటివరకూ ఎన్నికలకు సంబంధించి 727 ఫిర్యాదులు అందగా, వాటిని పరిష్కరించినట్టు తెలిపారు. 472 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని వెల్లడించారు. ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి 69 ఫిర్యాదులు రాగా, చర్యలు తీసుకున్నామని చెప్పారు.




