ఎస్‌ఈడీ-శ్రీచైతన్యల ఎంవోయూ
న్యూరోసైన్స్ ఆధారిత లెర్నింగ్ ప్లాట్‌ఫాం ప్రారంభం
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): అమెరికాకు చెందిన స్టూడెంట్ ఎడ్యుకేషన్ డయాగ్నస్టిక్స్ (ఎస్‌ఈడీ) తన నేచురల్ ఇంటెలిజెన్స్, న్యూరోసైన్స్ ఆధారిత లెర్నింగ్ డయాగ్నస్టిక్స్ ప్లాట్‌ఫాంను భారతదేశంలో ప్రారంభించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని హోటల్ దస్పల్లాలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈడీ, శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ మధ్య వ్యూహాత్మక ఎంవో యూ ప్రకటించారు.
న్యూరో సైన్స్ బేస్డ్ అసెస్మెంట్స్ ద్వారా విద్యార్థులు సమాచారాన్ని ఎలా గ్రహిస్తారు, ఎలా ఉపయోగిస్తారు అన్న దానిని విశ్లేషిస్తుంది. ఎస్‌ఈడీ వ్యవస్థాపకుడు శ్రీనేశ్ వి మాట్లాడుతూ.. ఎస్‌ఈడీ ద్వారా ప్రతి విద్యార్థి ఎలా నేర్చుకుంటాడో అర్థం చేసుకుని, వారి సామర్థ్యాన్ని వెలికి తీయడం మా లక్ష్యం అని, శ్రీచైతన్య వంటి ప్రముఖ సంస్థతో ఈ భాగస్వామ్యం ఒక ముఖ్యమైన ముందడుగు.‘ అని అన్నారు. ఎస్‌ఈడీ సీఈఓ అష్లీ సంబాలుక్ మాట్లాడుతూ.. పర్సనలైజ్డ్ లెర్నింగ్ విద్యారంగ భవి ష్యత్తు.
ఈ భాగస్వామ్యం ద్వారా శాస్త్రీ య విశ్లేషణను విద్యార్థుల మూల్యాంకనంలోకి తీసుకువచ్చి, ప్రతి విద్యార్థికి తగిన మార్గదర్శకత అందించాలనుకుంటున్నాం అని పేర్కొన్నారు. శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ అకడమిక్ డైరెక్టర్ సీమ బొప్పన మాట్లాడుతూ.. ఎస్‌ఈడీతో భాగస్వామ్యం కావడం మాకు ఆనందంగా ఉంది. నేచురల్ ఇంటెలిజెన్స్, న్యూరోసైన్స్ ఆధారంగా విద్యార్థుల లెర్నింగ్ ప్యాటరన్స్ అర్థం చేసుకోవడం ద్వారా విద్యా వ్యవస్థ మరింత బలపడుతుంది అన్నారు.




