హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్
నేడు హెచ్‌ఐసీసీలో ప్రారంభం
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రంగంలో అగ్రగామిగా పేరుగాంచిన హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్, తన సరికొత్త ఎడిషన్‌తో హైదరాబాద్ నగరాన్ని పలకరించనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శన ఈ నెల 21 నుంచి 23 వరకు మాదాపూర్‌లోని నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డిజైనర్లు, స్థానిక కళాకారులు, అంతర్జాతీయ బ్రాండ్లు ఒకే వేదికపై తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి.
ముఖ్యం గా హై-ఎండ్ ఫ్యాషన్, ట్రెండీ వేర్, డిజైనర్ చీరలు, వివాహ దుస్తుల ప్రత్యేక కలెక్షన్లు, హోమ్ డెకర్- ఇంటి అలంకరణకు అవసరమైన విలాసవంతమైన, కళాత్మక వస్తువులు, గౌర్మెట్ విభా గం- రుచికరమైన, నాణ్యమైన ఆహార ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుంది. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరుగా నిలిచిన హాయ్ లైఫ్ ఈసారి మరింత వైవిధ్య మైన సేకరణలతో సందర్శకులను అలరించడానికి సిద్ధమైందని, ఫ్యాషన్ ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.




