calender_icon.png 31 July, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాలియాలో ఘనంగా సీత్లా పండుగ

30-07-2025 12:00:00 AM

హాలియా, జూలై 29 : ప్రతీ ఏడాది గిరిజన ప్రజల ఆనవాయితీగా, సాంప్రదాయ బద్దంగా చిన్న పుష్యమి కార్తెలో జరుపుకునే సీతాలా పండుగను  మంగళవారం హాలియలో వున్నా గిరిజనులను  దేవతలు కరుణించాలని,విరివిగా వర్షాలు కురవాలని, పాడి పంటలతో గ్రామాలు చల్లగా ఉండాలని కుల దేవతలను వేడుకుంటూ గిరిజనులు సీత్ల పండుగను ఘనంగా జరుపుకున్నారు.అనుముల మండల పరిధిలోని బంజారా భవనం దగ్గర గిరిజన మహిళలు ప్రత్యేక పూజలు,వంటకాలు తయారు చేసి డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా గ్రామ పొలిమేరలో ఉన్న దేవతలకు నైవేద్యం సమర్పించారు.

ఏడుగురు సీత్లా భవాణి వద్ద మేకలు,యాటలను బలి ఇచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. వంటకాలను పశువులపై చల్లి ఎటువంటి సమస్యలు రాకుండా చూడాలని, స్థానికులు అనారోగ్య బారిన పడకుండా కాపాడమని వేడుకున్నారు.ఈకార్యక్రమంలో బుడియా బాబు పీఠాధిపతి అంగోతు. భగవాన్ నాయక్,చంద్రుడు నాయక్, బానోతు సకృ నాయక్,సపావత్ పాండు నాయక్,కుర్ర శంకర్, జవహర్ లాల్,అశోక్, నరేష్, సర్ధార్, విజయ్, నాగేందర్, బద్దు, చిన్నా నాయక్,శోభన్ బాబు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.