calender_icon.png 31 July, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుట గుట

31-07-2025 01:10:16 AM

  1. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో నేడు సుప్రీం తుదితీర్పు
  2. బీఆర్‌ఎస్ నుంచి అధికార కాంగ్రెస్‌లో చేరిన 10మంది..

న్యూఢిల్లీ, జూలై 30: రాష్ట్రంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో గురువారం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. బీఆర్‌ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. బీఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్‌లో చేరిన 10మంది ఎమ్మెల్యేల భవితవ్యం కోర్టు తీర్పుపై ఆధారపడి ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉదయమే తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.