29-07-2025 11:34:17 PM
నర్సంపేట (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు భవాని కుంట చెరువులో పడి రైతు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్ఐ గోవర్ధన్(SI Govardhan) కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఉప్పల రాజయ్య(59) రోజువారి లాగే వ్యవసాయ పనికి మృతుడి తోటి రైతు పొలంలో బురద గొర్రు దున్నడానికి వెళ్లి పని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో బురదమయంతో ఉన్న పశువులను గ్రామ శివారులో ఉన్న భవానికుంట చెరువులోకి తీసుకువెళ్లి పశువులను శుభ్రం చేసి చెరువుగట్టు పైకి ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి చెరువు నీటిలో మునిగి మృతి చెందాడని తెలిపారు. మృతుని కుమారుడు నరేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా స్థానిక ఎస్సై గోవర్ధన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.