09-05-2025 01:02:47 AM
మేడ్చల్, మే 8(విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అల్వాల్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న క్లినిక్, డయా గ్నస్టి క్‌లను అధికారులు సీజ్ చేశారు. కీసర డివిజన్ డిప్యూటీ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సత్య వతి, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ డిస్టిక్ ప్రో గ్రాం ఆఫీసర్ డాక్టర్ గీత గౌరవి పాలి క్లినిక్, భువన డయాగ్నొస్టిక్ సెంటర్ ను అధికారులు తనిఖీ చేశారు.
కనీస అర్హత లేకుం డా క్లినిక్ నిర్వహిస్తున్నారని, ఎస్టాబ్లిష్మెంట్ చట్టా న్ని ఉల్లంఘించారని తనిఖీలో తేలింది. దీం తో ఈ రెండింటిని సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారి పట్ల కఠిన చర్య లు తీసుకుంటామని అధికారులు తెలిపారు.