calender_icon.png 9 May, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరను నిర్ణయించాలి

09-05-2025 01:01:35 AM

ప్రముఖ ఆర్థికవేత్త డీ పాపారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

ముషీరాబాద్, మే 8 (విజయక్రాంతి) : రైతుల పండించిన పంటలన్నింటికీ స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనలకు అనుగుణం గా సమగ్ర పంటల ఖర్చు ప్రాతిపదికన కనీస మద్దతు ధరలు నిర్ణయించాలని ప్రముఖ ఆర్థికవేత్త డీ పాపారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఈ మేరకు గురు వారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు  రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అదే విధంగా నూతన వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా  కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పండించిన పంటలకు కనీస మద్దతు ధరలకు కేంద్రం చేయాలని డిమాండ్ చేశా రు. కార్పొరేట్ అనుకూల జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. రైతాంగ రుణాలన్నీ రద్దు చేయాలన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు రాష్ట్ర రైతాంగానికి, కౌలు రైతులతో సహా వడ్డీ లేని రుణాలు, విత్తనాలు, ఎరువులు వ్యవసాయ పరికరాలు సకాలంలో అందజేయాలన్నారు.

అటవీ హక్కుల చట్టం 2006ను సమగ్రంగా అమలు చే యాలన్నారు. పోడు సాగు చేసుకుంటున్న గిరిజన, గిరిజనేతర పేదలందరికీ పోడు పట్టాలు ఇవ్వాలన్నారు. పోడు సాగుదారులపై అక్రమంగా పెట్టిన కేసులన్నింటిని ఎత్తివేయాల న్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కెచ్చల రంగయ్య, ప్రధాన కార్యదర్శి వీ ప్రభాకర్, ఉపాధ్యక్షులు డీ రాము, రాష్ట్ర సహాయ కార్యదర్శి నంది రామయ్య, రంగారెడ్డి, చంద్రన్న, బిక్షమన్న తదితరులు పాల్గొన్నారు.