calender_icon.png 12 May, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌కు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలి

09-05-2025 01:05:31 AM

-ఆప్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

-సాయుధ దళాలకు సంఘీభావంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రదర్శన

ముషీరాబాద్, మే 8 (విజయక్రాంతి) : పాకిస్తాన్ భూభాగంలో బహుళ ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసిన భారత త్రివిధ దళాల ధైర్యానికి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వినర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అభినందనలు తెలియజేశారు. దళాల ధైర్యం ప్రతి భారత పౌరుడి విశ్వాసం ఆపరేషన్ ‘సిందూర్’ విజయం అన్నారు.

లోయర్  ట్యాంక్ బండ్‌లోని డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ విగ్ర హం వద్ద గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ భారత సాయుధ దళాలకు సంఘీభావంగా ప్రదర్శన నిర్వహించింది. ఉగ్రవాదం నిర్ములించాలి, పాకిస్థాన్ నశించాలి, భారత్ మాతాకీ జై అంటూ ఆప్ శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ పాకిస్థాన్‌లో పనిచేస్తున్న ఉగ్రవాద కర్మాగారా లను అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఆప్ ఫూర్తి మద్దతు తెలుపుతుందని తెలిపారు. భారతదేశంలో ఉగ్రవాద దాడులను అమలు చేయడంలో పాల్గొన్న జైష్-ఎ- మహ్మద్,  లష్కరే- -తోయిబా అగ్ర నాయకులను నిర్మూలించే ఉద్దేశ్యంతో ఆపరేషన్ ‘సిందూర్’ పేరుతో భారత దళాలు లక్ష్యాలను చేరుకోవడం గొప్ప విజయమన్నారు.

అత్యంత ముఖ్యమైన జాతీయ భద్రతపై ఎటువంటి రాజీ పడొద్దని, కేంద్ర ప్రభుత్వంతో రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ నిలబడాలని అయన విజ్ఞప్తి చేశా రు. భారత సైన్యం ఆపరేషన్ ‘సిందూర్’ ను ప్రారంభించడం వల్ల పహల్గామ్ దాడి బాధితులకు న్యాయం జరిగిందన్నారు.

ఉగ్రవా దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్న భారతదేశానికి ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలని, ఉగ్రవాద స్థావరాలను,  ఉగ్రవాదులను నాశనం చేయడానికి అన్ని దేశాలు భారత దేశంతో చేతులు కలపి ప్రపంచంలో శాంతియుత వాతావరణం సృష్టించడానికి బలంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్ నేతలు జావీద్ షరీఫ్, డా.లక్ష్య నాయుడు, సుధారాణి, అజీజ్ బేగ్, షాబాజ్, సిద్ధార్థ్, ఎస్.ఎన్.రెడ్డి, రమ్య గౌడ్, విశాలి, లియాఖత్ ఖాన్ పాల్గొన్నారు.