calender_icon.png 4 July, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడుచోట్ల మాదక ద్రవ్యాల పట్టివేత

10-10-2024 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): నగరంలోని మూడుచోట్ల ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు, సిబ్బంది దాడులు నిర్వహించారు. గంజాయి పట్టివేత, హషిష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. తెలిసిన వివరాల ప్రకారం.. గోల్కొండ అల్జాపూర్ ప్రాంతంలో హషిష్ ఆయిల్ అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ సీఐ శిరీష ఆదేశాల మేరకు ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు.

నిందితులు సయ్యద్ ఎండీ మజహర్ అలీ, ఎండీ అమీర్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 981 గ్రాముల హషిష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దందాతో ప్రమేయం ఉన్న మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.  అలాగే చార్మినార్ ప్రాంతంలో ఎస్టీఎఫ్ సిబ్బంది దాడులు నిర్వహించారు.

సుమారు రూ.4 లక్షల విలువైన 1.2 కిలోల గంజాయితో పాటు హషిష్ ఆయిల్‌ను స్వాధీ నం చేసుకున్నారు. అలాగే కాచిగూడ ప్రాంతంలో  దాడులు చేసి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రేఖ, ప్రమోద్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.