జేఈఈలో సెలక్ట్.. ఇంటర్లో ఫెయిల్
15-06-2024 01:03 AM
హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థి
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): జేఈఈలో ర్యాంక్ వచ్చిందని సంతోషపడాలో.. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడని బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన భూక్యా లోహిత్ అనే విద్యార్థి హైకోర్టును ఆశ్రయించాడు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసినందున సదరు సర్టిఫికెట్ సమర్పించేందుకు గడువు కావాలని విన్నవించాడు. ఈ నెల 7న సంబంధిత అధికారులకు వినతిపత్రం ఇస్తే స్పందన లేకపోవడం వల్ల హైకోర్టుకు రావాల్సివచ్చిందని వివరించాడు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు. విద్యార్థి ఈ నెల 7న సమర్పించిన వినతిపత్రంపై ఎలాం టి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు.






