24-05-2025 08:15:15 AM
టిడిపి రాష్ట్ర నాయకులు కనగాల అనంత రాములు
భద్రాద్రి కొత్తగూడెం (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ మండల పరిధిలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక లో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కనగాల అనంతరాములు డిమాండ్ చేశారు. శుక్రవారం పాల్వంచ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాల్వంచలో ఇందిరమ్మ ఇల్లు కేటాయింపులు కొన్ని అవకతవకులు జరుగుతున్నాయనీ ఇన్కమ్ టాక్స్ హోల్డర్ కు, కారు ఉన్నవారికి ,భూములు ఉన్నవారికి ఇందిరమ్మ కమిటీలోని సభ్యులే ఇండ్లను కేటాయించడం జరిగిందన్నారు. అందుకుగాను ఆరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమదృష్టి కి దృష్టికి వచ్చిందన్నారు.
ఈ విషయం కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు దృష్టికి తీసుకెళ్లడంతో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పారదర్శకంగా ఎంపిక జరుగుతుందని హామీ ఇచ్చారన్నారు.ఎలాంటి అవుతవుకులకు పాల్పడిన వారిని కచ్చిమైన ఆధారాలు చూపితే అరెస్ట్ చేయించి జైలుకు పంపుదాం అని కూడా హామీ ఇచ్చారన్నారు. ఈ పథకాన్ని నిజమైన పేదవారికి ఇండ్లు లేని పేదవారికి అందేలా చూడాలన్నదే తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయలు గతంలో చేసిన పనులు నాణ్యత లేనందున నేలల రోజుల్లోనే ఆ పనులన్నీ శిథిలమై కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ జరపన సీతారాం బాబు, సొసైటీ డైరెక్టర్ సుధాకర్, బత్తిన దుర్గారావు గౌడ్, రేగళ్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.