8 April, 2026 | 2:19 AM

సంక్షోభంలో స్వావలంబన ముఖ్యం

08-04-2026 12:00 AM

ఈ యుద్ధాలు నూతన గుణపాఠాలు నేర్పుతున్నాయి. బలమైన దేశాన్ని కూడా చిన్న దేశం ముచ్చెమటలు పట్టించవచ్చని ఇరాన్ ప్రపంచానికి చాటి చెప్తున్నది. కేవలం రెండు మూడు రోజుల్లో ఇరాన్‌పై యుద్ధం ముగించవచ్చని అనుకున్న ట్రంప్ నేతృత్వంలోని అమెరికా రోజు ఎన్ని కోట్ల రూపాయలు కోల్పోతోందో మన కండ్లముందు కనిపిస్తున్నది.

మానవుడు ఎంత విజ్ఞానాన్ని సంపాదించినా, ఎంత ఆధునీకరణ చెందినా మారుతున్న కాలానికి అనుగుణంగా తాను మారకపోతే వెనుకబడిపోతూ కనుమరుగవుతాడనేది వాస్తవం. అందుకే చార్లెస్ డార్విన్ తన పరిణామక్రమ సిద్ధాంతంలో కాలానికి అనుగుణంగా మారని ఏ జీవి మనుగడ సాగించదని ఏనా డో విశిదపరిచారు. పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన నాటి నుంచి నేటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కాలం వరకూ మాన వుని జీవితం, జీవన శైలి ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం ప్రపంచ గమనాన్ని క్షణాల్లో మార్పునకు గురిచేస్తుంది. 

ఆత్మనిర్భర్ భారత్ దిశగా..

ముఖ్యంగా ప్రపంచీకరణ నేపథ్యంలో క్రోనీ క్యాపటలిజం, సామ్రాజ్యవాదం ఈ ప్రపంచాన్ని నడిపించడంతోపాటు నాశనానికి కూడా కారణమవుతుంది. ముఖ్యంగా ఇటీవల కరోనా విలయతాండవంతో ప్రా రంభమైన ప్రపంచ అస్థిరత, తదుపరి గాజా పై ఇజ్రాయెల్ చేసిన యుద్ధం, నేటికీ జరుగుతున్న రష్యా యుద్ధం, ఇక తా జాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్‌అమెరికా చేస్తు న్న యుద్ధం మొత్తం ప్రపంచాన్ని అన్ని రం గాల్లో అస్తవ్యస్తంగా తయారు చేయడంతోపాటు అనేక పాఠాలు, గుణపాఠాలు నేర్పు తున్నది. ఇప్పటి వరకూ ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని దేశాలు, వేళ్ల మీద లెక్క పెట్టే కేవలం నాలుగు లేదా ఐదు దేశాలపై ఆధారపడి జీవిస్తున్నాయి.

ముఖ్యంగా అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, బ్రిటన్ వంటి దేశాలపై ఆధారపడుతున్నాయి. అన గా దాదాపు అన్ని వస్తువులు ఈ దేశాల నుంచే దిగుమతి చేసుకోవడం, ఆ దేశాలను సంపన్న దేశాలుగా తీర్చిదిద్దాయి. దాంతో మిగిలిన దేశాలన్ని పరాన్నజీవులుగా మారిపోయాయి. ఇప్పుడు మన దేశంలో దాదా పు అన్ని రాజకీయ పార్టీలు ఓట్లు దండుకోవడం, అధికారం చేపట్టడానికి ఉచిత పథ కాలు ప్రవేశపెట్టి, ప్రజలను సోమరిపోతులుగా ఎలా తయారు చేస్తున్నాయో.. అదే విధంగా మిగిలిన దేశాలన్ని ఐదారు దేశాలపై ఆధారపడి కాలం వెళ్లదీస్తున్న పరిస్థి తుల్లో కరోనా పెద్ద పాఠం నేర్పింది. దీంతో అన్ని దేశాలు స్వావలంబన దిశగా అడుగు లు వేస్తూ స్వదేశీ మార్కెట్లను బలోపేతం చేసుకుంటున్నాయి. మన దేశం ఆత్మనిర్భర్ భారత్, వికసిత భారత్ అనే బాటలో నడుస్తున్నది.

తీవ్రమైన చమురు సంక్షోభం

దాదాపు అన్ని దేశాలు తమ సొంత వనరులను సద్వినియోగం చేసుకోవాలని తపన పడుతున్నాయి. దిగుమతులు తగ్గించుకొని, ఎగుమతులు పెంచుకోవాలని గ్రహించా యి. ప్రస్తుతం మధ్యప్రాచ్య యుద్ధం తీవ్రమైన చమురు సంక్షోభాన్ని సృష్టించింది. దీం తో ఈ వాహనాలు, సోలార్ విద్యుత్ వం టి విధానాల అమలు దిశగా అన్ని దేశాలు యుద్ధ ప్రాతిపదికన నడుం బిగించాయి. ఏ విషయంలోనైనా ఇతర దేశాలపై ఆధారపడితే ప్రమాదం ఉందని ఈ గుణపాఠాలు నేర్పుతున్నాయి. అలాగే సంపద, పెట్టుబడులు ఒకేచోట కేంద్రీకతం చేయడం వంటి వి కూడా ప్రమాదమని తెలుస్తోంది. ఈ యుద్ధాలు నూతన గుణపాఠాలు నేర్పుతున్నాయి. బలమైన దేశాన్ని కూడా చిన్న దేశం ముచ్చెమటలు పట్టించవచ్చని ఇరాన్ ప్రపంచానికి చాటి చెప్తున్నది.

కేవలం రెండు మూడు రోజుల్లో ఇరాన్‌పై యుద్ధం ముగించవచ్చని అనుకున్న ట్రంప్ నేతృత్వంలోని అమెరికా రోజు ఎన్ని కోట్ల రూపాయలు కోల్పోతోందో మన కండ్లముందు కనిపిస్తున్నది. ఇక అమెరికాకు పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతిస్తున్న యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాలు ఎం త నష్టపోతున్నామో ఇకనైనా గ్రహించాలి. చిన్న చిన్న డ్రోన్లు, క్షిపణులు వాడుతూ అమెరికా ఇరాన్ చుక్కలు చూపిస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరి దేశం కోసం వారు, ఎవరి ప్రజల కోసం వారు పరిపాలన అందించాలని గ్రహించా రు. నాటో, ఈయూ దేశాలు ఇప్పటికే ఒంటరిని చేయడంతో అమెరికా కంగుతిన్నది. 

మన దేశం కూడా శాంతితోనే సమస్యలు పరిష్కారమవుతాయని మొదటి నుంచి చెప్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఇలాంటి పరిస్థితుల్లో దౌత్యపరమైన చర్యలు చేపట్టాలి. ఇక ఇరాన్ యు ద్ధంలో తన శక్తి సామర్థ్యాలు తెలుసుకుని ముందుకు సాగుతోంది. పెట్టుబడిదారులు ఎక్కడ తమ పెట్టుబడులు పెట్టారో, ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టారో తెలుసుకుని ఇరాన్ దాడులు చేస్తున్నది. ముఖ్యంగా ప్రపంచ దేశాలకు అవసరమైన చమురు, సాఫ్ట్‌వేర్ కంపెనీలపై ఇరాన్ పంజా విసురుతున్నది.

ఇప్పటికే బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా ఐటీ సంస్థలపై దాడులు చేసింది. అభివద్ధి చెందిన అమెరికాను చూసి, ట్రంప్ బెదిరింపులను చూసి, అగ్రరాజ్య ఆయుధ సంపత్తిని చూసి ఇరాన్ భయపడటం లేదని గ్రహించాలి. వాటి వెనుక ఉన్న పెట్టుబడిదారుల భరతం పట్టేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తున్నది. అమెరికా ఆర్థిక, సాంకేతిక రంగాలను దెబ్బతీయాలని ఇరాన్ చూస్తుంది. ఎంతటి శత్రువునైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చని ఇరాన్ చాటిచెప్తున్నది. ఆ దేశ సంక ల్పబలం ప్రపంచంలోని ఇతర దేశాలకు మార్గం చూపుతున్నది. 

కరోనా విలయతాండవం తరువాత

ఈ నేపథ్యంలో కరోనా విలయతాండ వం, నేటి యుద్ధాలు ప్రపంచ దేశాలకు అనే క కొత్త విషయాలను తెలియజెప్పాయి. శత్రువును చూసి కాదు, వాడి బలహీనతపై గురిపెట్టి పైచెయ్యి సాధించవచ్చని ఇరాన్ చాటిచెప్పింది. ముఖ్యంగా స్వావలంబన దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగాలని, స్వదేశీ పరిజ్ఞానంతో నైపుణ్యాలు సం పాదించి, నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి కృషి చేయాలని నేటి పరిస్థితులు మనకు పాఠాలు నేర్పుతున్నాయి.

ముఖ్యంగా ఏ దేశం కూడా అస్థిరత, అలజడుల పట్ల ఆం దోళన చెందకుండా, ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని ముందుకుసాగాలి. ము ఖ్యంగా సౌరశక్తి వినియోగాన్ని పెంచడం ద్వారా గల్ఫ్ దేశాలపై ఆధారపడే అవసరం ఉండదని గ్రహించాలి. ఇప్పటికే అంతరిక్షంలో, ఫార్మా రంగంలో, వైద్య రంగంలో, ఆయుధ తయారీలో, సాఫ్ట్‌వేర్ రంగంలో భారతదేశం గణనీయంగా అభివృద్ధి సాధించింది. ‘చిప్ తయారీ’లోనూ భారత్ ముం దంజలో ఉండటం శుభపరిణామం. 

ప్రస్తుత తరుణంలో ముఖ్యంగా మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలకులు ఉచితాలకు స్వస్తి పలకాలి. అందరికీ విద్య, వైద్యం, ఉద్యో గ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్య లు చేపట్టాలి. వ్యవసాయ, పారిశ్రామిక రం గాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నించాలి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతిని నిర్మూలించాలి.  ఎగుమతులను పెంచి దిగుమతులను తగ్గించుకోవాలి. విదేశీ మారక ద్రవ్యం పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి. కాలం నేర్పుతున్న పాఠా లు, గుణపా ఠాలను అవగాహన చేసుకొని ముందుకు సాగడం ద్వారానే వికసిత్ భారత్ సాధ్యపడుతుంది. అంతేకాదు, సామ్రాజ్యవాద ఆధిప త్య దేశాలకు చెక్ పెట్టవచ్చు. అశాంతి, అస్థిరతల మధ్య ఉన్న ఈ ప్రపంచంలో అవకా శాలు అందిపుచ్చుకొని, దేశా భివృద్ధికి చిత్తశుద్ధితో పని చేయాలి.

-వ్యాసకర్త సెల్: 9390509791

ఐ.ప్రసాదరావు