యుద్ధం ఎప్పుడు? సంధి యెప్పుడు?
జ్యాయాంశ్చేన్న సంధిమిఛ్ఛేత్,
దండోపనత
వృతమాబలీయనం
వా యోగమారిష్ఠేత్! (కౌటిలీయం 73)
సైనికశక్తి తక్కువగా ఉండడం, ఆర్థికంగా బలహీనంగా ఉండడం, ప్ర భావవంతం గాని రాజకీయ వ్యవస్థ గలిగిన చిన్నరాజ్యం శక్తిమంతమైన రాజ్యంతో యు ద్ధం చేయడానికి ప్రయత్నించడం ప్రమాదకరం. యుద్ధం అనివార్యమైతే ముందుగా బలాన్ని పెంచుకోవాలి. మిత్రులను సంపాదించుకోవాలి వీలైనమేరకు సంధి చేసుకో వాలి. అయితే.. తనకంటే ఎక్కువ బలం కలిగిన శత్రువు సంధి చేసుకోవడానికి అంగీక రించకపోతే ‘దండోపనత’ విధానాన్ని గాని, ‘ఆబలీయస’ విధానాన్ని కాని అనుసరించా లి అంటాడు ఆచార్య చాణక్య. దండోపనత అంటే సైన్యంతో లొంగిపోయి, అవకాశం వచ్చినప్పుడు ప్రతీకారాన్ని తీర్చుకోవడం కాగా ఆబలీయస అంటే శక్తి తక్కువగా ఉన్న రాజు అనుసరించవలసిన మార్గం.
బలం చాలనప్పుడు, శత్రువు సంధికి ఇష్టపడనప్పు డు నేరుగా యుద్ధం చేయకుండా పరోక్ష మార్గాల నన్వేషించడం, వ్యూహాత్మకంగా వ్యవహరించడం, సమయం చూసి స్పందించడం ఆబలీయస విధానం. అవసరమైతే క పట యుద్ధం చేయాలంటాడు చాణక్య. ప్ర స్తుత ప్రపంచంలో దేశాలు నేరుగా యుద్ధానికి వెళ్లకుండా ప్రాంతీయ మితృత్వాలను పెంచుకోవడం, ఎదుటివారి ఆర్థిక మూలాలను ఛిద్రం చేయడం జరుగుతున్నది. అమెరికా సైనిక, సాంకేతిక శక్తిలో బలంగా ఉన్న ది. అలాగే, ఇజ్రాయిల్ రక్షణ, టెక్నాలజీలో బలంగా ఉన్నది. ప్రత్యక్షంగా ఈ రెండు దేశాలతో పోలిస్తే ఇరాన్ కొన్ని రంగాలలో బల హీనంగా ఉన్నా ఆబలీయస విధానంలో రెం డు దేశాలకూ దీటుగా సమాధానం ఇవ్వడం చూస్తున్నాము.
విదేశాంగ విధానాలు, దౌత్యనీతి, యుద్ధా లు, శాంతి నిర్ణయాలు, మైత్రీకూటములు, వ్యూహాలను గూర్చి చాణక్య అర్థశాస్త్రంలో విస్తృతంగా చర్చించాడు. సమీపంలో ఉండే రాజ్యాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడడం సహజమే. ఆయా రాజ్యాలను సహజ శత్రువులుగానూ, సహజ మిత్రులుగానూ (శత్రువులకు శత్రువులు) చెపుతూ రాజ్యాల కూటములు ఎప్పుడూ నైతికతపై కాక స్వంత ప్రయోజనాలపై ఆధారపడి ఉంటాయంటాడు చాణక్య. సిద్ధాంతం కన్నా ఆచరణవా దానికే ప్రాధాన్యత. ప్రతిదేశానికీ మరొక దేశంతో సంబంధాలు అంటే దాని ఆర్థిక, జాతీయ ప్రయోజనాలే కాని ఏ దేశమూ మరో దేశాన్ని శాశ్వత మిత్రులు లేదా శాశ్వత శత్రువులుగా పరిగణించదు.
సమస్యల పరిష్కారంలో ఒప్పందాలు ఇరుపక్షాలకూ శ్రే యస్సును కలుగచేస్తూ ప్రయోజనకర మైనప్పుడు శాంతికి ప్రాధాన్యత ఇవ్వడం మంచి ది. యుద్ధం అనివార్యం అయితే ప్రత్యక్ష యుద్ధం తనకు అనుకూలంగా లేనప్పుడు పరోక్ష మార్గాలను ఉపయోగించాలి అంటా డు చాణక్య. నిజానికి యుద్ధాలు మూడు రకాలు. బహిరంగ యుద్ధం, రహస్య యు ద్ధం (పరోక్షంగా సహకరించడం, మోసం చేయడం), నిశ్శబ్ద యుద్ధం (గూఢచర్య చర్య లు, ఉగ్రవాదులను ప్రేరేపించి విధ్వంసకాండను సృష్టించడం). ఈనాడు సైబర్ యుద్ధా లు, గూఢచార కార్యకలాపాలు, ఆర్థికంగా దెబ్బతీయడాలు.. ఇవన్నీ పరోక్ష యుద్ధాలే.
యుద్ధంలో జయాపజయాలు ఎలా ఉ న్నా ప్రాణ నష్టం ఎంతో కొంత ఉంటుంది. ఆస్తినష్టం ఎలా ఉన్నా ప్రాణ నష్టం వల్ల వి లువైన శిక్షణను పొందిన సైనికులు మరణిస్తే తిరిగి అలాంటి వారిని తయారు చేసు కోవడం అత్యంత క్లిష్టమైన పని. అందుకని యుద్ధ సమయంలో నాయకునికి తన సైన్యాన్ని రక్షించుకోవడం, ఎదుటి సైన్యాన్ని నాశనం చేయడం రెండూ ముఖ్యమైన కర్తవ్యాలు. అంతేకాదు, యుద్ధం ఎప్పుడూ ఫలి తాలను సాధించేందుకు ఉద్దేశించినదే. అడవిలో బ్రతకాలంటే ఎలాగైతే గెలవాలో అలా గే యుద్ధం ఓడిపోకుండా ఉండేందుకు కా దు గెలిచేందుకు పోరాడాల్సిందే. గెలవాలని నిలిచినప్పుడు ప్రక్రియ ముఖ్యమే గాని, దా నికన్నా ముఖ్యమైనది ఫలితాల సాధన.
అయితే, యుద్ధాన్ని భావోద్వేగ పరంగా కాకుండా ప్రయోజనం ఆధారంగా నిర్ణయించుకోవాలి. పరిస్థితులు అనుకూలంగా లేనంత వరకు పోరాడవద్దు. ఉద్దేశం కంటే సమయానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. బలమై న రాజు కూడా సరైన సమయం కోసం వేచిచూస్తాడు, ఉద్రిక్తతను నియంత్రించే ప్రయ త్నం చేస్తాడు. ఇది బలహీనత కాదు. వ్యూహాత్మక సహనమంటాడు చాణక్య. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశంపై పాకిస్థాన్ దుశ్చర్యపై స్పందనకు చాలినంత సమయం తీసుకొని కోలుకోలేని విధంగా దెబ్బతీయడం మనం గమనించాలి.
యుద్ధం ప్రారంభమయ్యాక జరిగే వి ధ్వంసాన్ని అంచనా వేయడం కష్టసాధ్యం. యుద్ధం విజయాన్ని మాత్రమే కాకుండా, నికర లాభాన్ని కూడా అందించాలి. దేశం శక్తివంతమైనదైనా యుద్ధవ్యయం యుద్ధప్రయోజనాల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, సంఘర్షణ అంతర్గత వనరులను హరించివేస్తున్నప్పుడు, యుద్ధంలో అవసరమైన విరా మం తీసుకోవడం ఉత్తమం. ప్రపంచ కట్టుబాట్లు, దేశీయ ప్రాధాన్యతలు, దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రతిఫలం... వీటన్నింటినీ దృష్టి లో పెట్టుకొని వ్యూహాలను లేదా నిర్ణయాలను పునఃపరిశీలించుకోవడం, సమీక్షించు కోవడం అవసరం.
లాభనష్టాలు అస్పష్టంగా ఉన్నప్పుడు, ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పుడు, ఫలితాలు అనిశ్చితం గా ఉన్నప్పుడు సంకోచించడం అంటే నిర్ణ య రాహిత్యం కాదు, అది సరిగ్గా మూల్యాంకనం చేయడమే. పోరాట పద్ధతిని మార్చు కొని భిన్నమైన మార్గంలో తిరిగి దాడిచేయడమే. పరిమిత దాడులు, వ్యూహాత్మక సం యమనం, సమయానుకూల ప్రతిస్పందనలు.. ఇలాంటివి ఆవేశపూరిత యుద్ధాలు కావు.
ఒక దేశ బలాన్ని కేవలం సైనికపరంగా కొలవడం సరికాదు. ప్రజలందించే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, సంపద దేశానికి నైతికంగా విజయాన్ని ప్రసాదిస్తుంది. దానికి అదనంగా ఆయా దేశ సైనికాధికారుల సా మర్థ్యం, యుద్ధంలో వారనుసరించే వ్యూహ పటిమ, అనుకూల వాతావరణం, సైనికుల క్రమశిక్షణ, సైనికాధికారులు, సైనికుల మ ధ్య సయోధ్య, సైనిక బలాల అధునాతన ఆ యుధ సంపత్తి, వాటిని ఉపయోగించడంలో పొందిన మెరుగైన శిక్షణ, ముఖ్యంగా యుద్ధ సమయంలో సైనికులు లోనయ్యే ఒత్తిడి అపారం.. దాన్ని నిర్వహించుకునే విధానం లో వారు పొందిన శిక్షణ సమున్నతంగా ఉండాలి.
సైనికులకు ప్రభుత్వం నుంచి లభిస్తున్న ఆదరణ, ప్రేరణ, అందుతున్న వనరు లు, వసతులు.. ఈ అంశాలపై కచ్చితమైన అంచనాలు ఉంటే సైనికుల సంఖ్య తక్కువైనా ఎక్కువైనా విజయ సాధకులు ఎవరో తెలుసుకోవచ్చు. బలమైన రాజ్యాన్ని నిలబెట్టడంలో నాయకత్వ దూరదృష్టి, ప్రణాళికాబ ద్ధమైన వ్యూహ రచన, పరిణత దౌత్యం సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడం ప్ర ముఖ పాత్రను పోషిస్తాయి. పాలకులు ఎల్లప్పునడూ పరిస్థితులను విమర్శనాత్మకంగా అంచనా వేసి, దూరదృష్టితో వ్యవహరించాలని చెప్పిన చాణక్యుని బోధనలు సార్వకాలికమై ఈనాటి రాజకీయ, పరిపాలనా వ్యవస్థలలో సూచన ప్రాయంగానైనా ప్రతిబింబిస్తున్నాయి.
- పాలకుర్తి రామమూర్తి




