calender_icon.png 27 October, 2025 | 12:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోటీ ప్రపంచంలో స్వయంకృషితో ఎదగాలి

27-10-2025 12:41:51 AM

  1. ఎమ్మెల్యే గడ్డం వినోద్ 

జాబ్ మేళాకు భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు

బెల్లంపల్లి, అక్టోబర్ 26: పోటీ ప్రపంచం లో నిరుద్యోగులు, విద్యార్థులు స్వయంకృషితో ఎదగాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సూచించారు. ఆదివారం ఉదయం ఏఎంసి నెంబర్ 2 గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను కలెక్టర్ కుమార్ దీపక్, సబ్ కలెక్టర్ మనోజ్, సింగరేణి అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారం భించిన అనంతరం మాట్లాడారు.

విద్యార్థు లు కష్టపడి పోరాడితేనే జీవితంలో అత్యున్న త స్థానాల్లో నిలదొక్కుకుంటారని,  బెల్లంపల్లి ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలని సదుద్దేశంతోనే ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు ఎక్కడా నిరాశ చెందకుండా చిత్తశు ద్ధితో అవకాశాలను వినియోగించుకొని జీవితంలో పైకి ఎదగాలని ఆకాంక్షించారు.

కాగా, బెల్లంపల్లిలో నిర్వహించిన మెగా జాబ్ మే ళా కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి విద్యార్థులు, నిరుద్యోగు లు భారీగా తరలివచ్చారు. మొట్ట మొదటిసారిగా బెల్లంపల్లి ప్రాంతంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 70 వరకు ప్రైవేటు కంపెనీలు పాల్గొన్నాయి. నిరుద్యోగ అభ్యర్థులు తమ ఉద్యోగ దరఖాస్తులను సమర్పించేలా సింగరేణి అధికారులు హెల్ప్ డెస్కుల ను ఏర్పాటు చేశారు. సింగరేణి యాజమా న్యం భోజన, తాగునీటి వసతి కల్పించారు.

4,812 మంది ఉద్యోగ మేళకు హాజరుకాగా, 1200 మంది అర్హత సాధించారు. అనంతరం ఇంటర్వ్యూలో ఎంపికైన పలువురికి ఉద్యోగ నియామక పత్రాలను ఎమ్మెల్యే వినోద్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ (డైరెక్టర్) కె వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్, మందమర్రి ఏరియా జీఎం ఎన్ రాధాకృష్ణ, ఎస్‌ఓటు జిఎం విజయ్ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, కేకే గ్రూప్ ఏజెంట్ రాంబా బు, కేకే ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, ఎస్.కె గ్రూప్ ఏజెంట్ అబ్దుల్ అన్సారి.

, ఏఐటీయూసీ మందమర్రి  బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, సిఎంఓ ఏరియా కార్యదర్శి రమేష్, సివిల్ ఎస్‌ఈ రామ్, ఏఐటియుసి బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, నోబెల్ ఎంపవర్మెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు డి సురేష్ కుమార్, ప్రాజె క్టు మేనేజర్ శోభన్ బాబు, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.