calender_icon.png 27 October, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామూహిక వివాహాలు అభినందనీయం

27-10-2025 12:41:53 AM

-గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ

- అచ్చంపేటలో వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో 111 చెంచుల జంటల సామూహిక వివాహాలు

-హాజరైన హైకోర్టు జడ్జి మాధవి దేవి, మాజీ గవర్నర్ దత్తాత్రేయ

-గోండి భాషలోకి అనువదించిన సుందరకాండ పుస్తకం ఆవిష్కరణ

అచ్చంపేట, అక్టోబర్ 26: వివిధ ప్రాంతాలకు చెందిన చెంచు గిరిజన ఆదివాసీ జం టలకు ఒకే వేదికపై సామూహిక వివాహాలు నిర్వహించడం ప్రశంసనీయమని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో వనవాసి కళ్యాణ పరిషత్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో 111 చెంచు గిరిజన జంటలకు సామూహిక వివాహాలు నిర్వ హించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా గవర్నర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

గవర్నర్‌తో పాటు హైకోర్టు జడ్జి మాధవి దేవి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆదివాసి కళ్యాణ ఆశ్ర మం అఖిలభారత కార్యకారిణి రేఖ నగర్, ప్రాంత అధ్యక్షులు కాట్రాజు వెంకటయ్య నూతన వధూవరులను ఆశీర్వదించారు. వేడుకను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ.. అడవులను నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీలను ఒకే చోట వారి సాంప్రదాయ పద్ధ తుల్లో ఒకే వేదికపై వివాహాలు జరిపించడం హర్షనీయమన్నారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు దేవుడి అండ దండలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. చెంచు గిరిజనుల సామాజిక వివా హ మహోత్సవానికి గవర్నర్ హాజరై ఆశీర్వదించడం అభినందనీయమన్నారు.

భార తీయ సాంప్రదాయ ప్రకారం ఆదివాసీల వివాహాలు జరిపించిన నిర్వాహకులను అభినందించారు. హైకోర్టు జడ్జి టి మాధవిదేవి మాట్లాడుతూ.. సామూహిక వివాహాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉన్నదన్నారు. నారాయణపేట జిల్లా అంబత్రేయ క్షేత్రం ఆదిత్య పరాశర స్వామి ఆశీర్వచన ప్రసంగం చేశారు. అంతకు ముందు గవర్నర్ కు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆదివాసి కళ్యాణ పరిషత్  జిల్లా అధ్యక్షుడు ఉడతనూరి లింగ య్య, మహిళ ప్రముఖ గుర్రం శంఖులత పాల్గొన్నారు.

సుందరకాండ పుస్తకం ఆవిష్కరణ

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తొడ సం కైలాస్.. గోండి భాషలోకి అనువదించిన సుందరకాండ సోభత ఖడి పుస్తకాన్ని గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ ఆదివారం అచ్చంపేటలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిన్ మాధవి దేవి, అఖిల భారత వనవాసి కళ్యాణ పరిషత్ అధికారి రామచంద్రయ్య, వెంకటేశ్వర రావు దేశ్‌పాండే, హెచ్‌కే నాగు, ఆదిత్య పరాశర స్వామి, రేఖ నాగర్ ఇండోర్ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి పంద్రం శంకర్, జిల్లా సంఘటన మం త్రి తొడసం అజయ్, ప్రఖండ ప్రముఖ్ అర్క గణేష్, వైజాపూర్ గ్రామవాసి మడవి మహేందర్, తొడసం సృజన్ పాల్గొన్నారు.